తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలో యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు.;

Advertisement
Update:2024-09-23 09:53 IST
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం
  • whatsapp icon

శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దోష నివారణ యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.శాంతి హోమం ముగిశాక పండితులు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. బూందీ పోటు, లడ్డూ పోటు, అన్న ప్రసాదంలో పోటులో పంచగవ్వ సంప్రోక్షణ చేపడుతారు.

ఉదయం 10 గంటల వరకు టీటీడీ శాంతి హోమం నిర్వహించనున్నది. ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూకు వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోమం అనంతరం అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామన్నారు.


Tags:    
Advertisement

Similar News