శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

బుడుమూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది;

Advertisement
Update:2025-03-15 21:21 IST

శ్రీకాకుళం జిల్లా బుడుమూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. మృతులు పాతపట్నం మండలం లోగిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న దువ్వారి మీనమ్మ, భాస్కరరావు ,లక్మీపతి మృతి చెందగా దువ్వారి కాళిదాసు, కుసుమ తీవ్రంగా గాయపడ్డారు. పాత పట్నం మండలం లోగిడి గ్రామం నుంచి విశాఖలో బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News