తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.;
తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లేఖలకు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 24 నుంచి అమలు చేయనున్నట్లు తిరుమల దేవస్ధానం పేర్కొన్నాది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపిన టీటీడీ.శ్రీవారి దర్శనం విషయంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని తెలంగాణ ప్రజా ప్రతినిధులు గత కొంత కాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు.
అంతేకాదు తిరుమల వెంకటేశ్వర స్వామితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని కనుక కూటమి సర్కార్ ఈ విషయంలో స్పందించి తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. గతంలో పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు శ్రీవారి దర్శనంలో విషయంలో బహిరంగ విమర్శించిన సంగతి తెలిసిందే.