రేపటి నుంచే ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు
ఏపీలో రేపటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.;
ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాయనున్న టెన్త్ క్లాస్ విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందరూ చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోండి. టెన్షన్, ఆందోళన పడొద్దు. ఎటువంటి ఒత్తిడికి గురి కావద్దు. హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లండి. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే సమయం ఇది. ప్రశాంతంగా ఉండండి. సకాలంలో పరీక్ష పూర్తి చేయండి. విజయీభవ’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పీలో ఈసారి పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,49,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు మొత్తం 6 సబ్జెక్టులకు గాను 7 పేపర్లు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.