అమరావతిలో 58 అడుగుల విగ్రహం : సీఎం చంద్రబాబు

పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు;

Advertisement
Update:2025-03-16 13:31 IST

ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి సీఎం నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం అభివృద్ధికి చేసి అక్కడ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఉగాది నుంచి పీ-4 విధానం ప్రారంభిస్తున్నాం. ఆర్థిక అసమానతలు తొలగించేందుకే ఈ విధానం. ప్రతి ఒక్కరూ పొట్టిశ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలి. ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని పైకి తేవాలి. ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 16 వరకు వీటిని నిర్వహిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

Tags:    
Advertisement

Similar News