వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం

వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.;

Advertisement
Update:2025-03-17 21:30 IST

వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి యర్రం పిచ్చమ్మ నేడు తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలులో కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు.లోక్ సభ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి... తల్లి మరణవార్తతో హుటాహుటీన ఒంగోలు బయల్దేరారు. వైవీ తల్లికి రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్... యర్రం పిచ్చమ్మ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. వైఎస్... వైవీ సుబ్బారెడ్డి కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే.వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలగడం పట్ల జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలు రేపు బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఉదయం 10.30 గంటలకు జరగనున్నాయి. పిచ్చమ్మ అంత్యక్రియలకు జగన్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News