గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు తన పదవికి రాజీనామా చేశారు.;
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. 2021లో గుంటూరు మేయర్ గా వైసీపీ నుంచి మనోహర్‌నాయుడు మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉండగానే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతు తనను కూటమి ప్రభుత్వం అవమానిస్తోందని విమర్శించారు. మేయర్‌కు ఉన్న ప్రొటోకాల్ తీసేశారని మండిపడ్డారు. స్టాండింగ్ కమిటీ సమావేశంపై సమాచారం ఇవ్వలేదని ఇలా అవమానం ఎప్పుడూ జరగలేదన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తునట్లు పేర్కొన్నారు.
గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరో వైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో.. ఆరు స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఆ పార్టీకి పరాజయం తప్పలేదు. ఈనెల 17న స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మేయర్ కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది.