ఆ కేసులో అనుమానాస్పద రీతిలో చనిపోతున్న సాక్షులు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదన్న ఆయన కుమార్తె;
Advertisement
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇంకా తమకు న్యాయం జరగలేదని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలో నివాళి అర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వారంతా బైట తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలుపెడుతుందని ఆశిస్తున్నాను. దర్యాప్తు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారని అనుమానం కలుగుతున్నది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు అని సునీత అన్నారు.సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.
Advertisement