గవర్నర్‌ను కలిసిన వైఎస్ సునీతారెడ్డి
వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు.;
వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని గవర్నర్‌ని సునీతా కోరారు. వివేకా మర్డర్‌లో పరిణామాలను గవర్నర్‌కు ఆమె వివరించారు. ఇవాళ ఉదయం వివేకా ఆరో వర్థంతి వేళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రార్థన నిర్వహించారు.
సమాధి వద్ద వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కేసులో నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వారంతా బయట తిరుగుతున్నారని సునీత తెలిపారు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా మొదలు కాలేదన్నారు. ఎంక్వరీ ముందుకు సాగకుండా నిందితులు సిస్టంను మేనేజ్ చేస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.