ముగిసిన పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ విచారణ ముగిసింది.;
Advertisement
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ విచారణ ముగిసింది. దీంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు విచారించారు.అయితే, పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. దీనికోసం మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
పీటీ వారెంట్ పై పోసానిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను విచారించారు. విచారణ అనంతరం జైలుకు తరలించగా, సీఐడీ మరోసారి విచారణ కోసం కోర్టును ఆశ్రయించనుంది. పోసాని బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
Advertisement