అప్పుకి అడ్డుపడ్డారు.. అభివృద్ధినీ అడ్డుకుంటున్నారు..

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు మరోసారి బయటపడింది. ఇతర రాష్ట్రాలకు అప్పు తెచ్చుకోడానికి ఎలాంటి పరిమితులు విధించని కేంద్రం.. తెలంగాణ విషయంలో మాత్రం కొర్రీలు వేస్తోంది. అప్పు తీసుకోవడంపై ఆంక్షలు విధిస్తోంది. కేంద్రం విధించిన పరిమితి కారణంగా తెలంగాణ 19వేల కోట్ల రూపాయల రుణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకీ వివక్ష..? బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు, తమ మాట వింటారు, భవిష్యత్తులో వారికి పనికొస్తారు అనే పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం భారీగా వెసులుబాటులు కల్పిస్తోంది. ఈ క్రమంలో […]

Advertisement
Update:2022-07-08 06:04 IST

తెలంగాణపై కేంద్రం చిన్నచూపు మరోసారి బయటపడింది. ఇతర రాష్ట్రాలకు అప్పు తెచ్చుకోడానికి ఎలాంటి పరిమితులు విధించని కేంద్రం.. తెలంగాణ విషయంలో మాత్రం కొర్రీలు వేస్తోంది. అప్పు తీసుకోవడంపై ఆంక్షలు విధిస్తోంది. కేంద్రం విధించిన పరిమితి కారణంగా తెలంగాణ 19వేల కోట్ల రూపాయల రుణాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

ఎందుకీ వివక్ష..?

బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు, తమ మాట వింటారు, భవిష్యత్తులో వారికి పనికొస్తారు అనే పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం భారీగా వెసులుబాటులు కల్పిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది కేంద్రం. దాని ఫలితమే రుణపరిమితిపై ఆంక్షలు. పోనీ తెలంగాణ అప్పుల విషయంలో పరిమితి దాటిందా.. అంటే అదీ లేదు. గరిష్ట రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం 10. మొట్టమొదటి స్థానంలో తమిళనాడు ఉంది.

గత ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు అత్యథికంగా 87,977 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది. రెండో స్థానంలో ఉన్న యూపీ అప్పు 75,500 కోట్ల రూపాయలు. కర్నాటక, మహారాష్ట్ర చెరో 75,000 కోట్లు అప్పు తీసుకున్నాయి. పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో ఉన్నాయి. పదో స్థానంలో ఉన్న తెలంగాణ అప్పు కేవలం 43,784 కోట్ల రూపాయలు మాత్రమే.

ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం 53,000 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. కేవలం 34 వేలకోట్లకు మాత్రమే అనుమతి లభించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న 43,784 కోట్ల రుణంతో పోల్చి చూస్తే.. చాలా తక్కువ.

దాదాపుగా 19వేల కోట్ల రూపాయలు తక్కువ. ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నా, అప్పుల విషయంలో మిగతా రాష్ట్రాలకంటే మెరుగైన స్థానంలో ఉన్నా కూడా కేంద్రం మాత్రం తెలంగాణకు మొండిచేయి చూపుతోంది. రుణ పరిమితిని తగ్గించడం, మార్కెట్ బాండ్లకోసం ఆర్బీఐని ఆశ్రయించేందుకు అనుమతి ఆలస్యం చేయడం కూడా కేంద్రం రాజకీయ దురుద్దేశాలను తెలియజేస్తోందని విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.

Tags:    
Advertisement

Similar News