పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్;
పూరీలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను శేరిలింగంపల్లికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా ఒడిశా కళాకారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పూరీ సముద్రం చెంద రూపుదిద్దిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటున్నది. సైకత శిల్పంలో కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ అని అందులో పేర్కొన్నారు. అచ్చం ఎమ్మెల్సీ కవితలా రూపుదిద్దిన సైకత శిల్పం చెంత కళాకారులతో కలిసి భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఎమ్మెల్సీ కవిత బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. పలువురు కళాకారులకు నూతన వస్త్రాలను అందజేశారు. వారితో కలిసి శుభాకాంక్షలను తెలుపుతూ వీడియోను రూపుదిద్దారు. డ్రోన్ తో సైకత శిల్పాన్ని, కళాకారుల నృత్యాలను చిత్రీకరించారు. బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని రవీందర్ యాదవ్ చాటుకున్నారు. హైదరాబాద్ లోనూ పలు చోట్ల బర్త్ డే వేడుకలను రవీందర్ యాదవ్ అనుచరులు నిర్వహించారు. రాణిరుద్రమ లాంటి రాజసం ఎమ్మెల్సీ కవితదని ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలి దశలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. తెలంగాణ బతుకమ్మను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని స్పష్టం చేశారు. నాడు ఎంపీగా, నేడు ఎమ్మెల్సీగా రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం నిరంతరం తపిస్తారన్నారు. ఆపద వస్తే ముందుండే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని రవీందర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ అడుగు జాడలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయగా రాణిస్తున్నారని స్పష్టం చేశారు.