ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదు

గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉన్నదని..పీసీసీ అధ్యక్షుడు, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా? అని సీఎం ప్రశ్న;

Advertisement
Update:2025-03-13 13:46 IST

గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉన్నదని.. ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరి ట్రాప్‌లో తాను పడనన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలవడానికి ఢిల్లీ చేరుకున్న సందర్బంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ గవర్నర్‌ ప్రసంగానికి రావడం కాదని.. అసెంబ్లీలో చర్చకు హాజరుకావాలన్నారు. డీలిమిటేషన్‌.. లిమిటేషన్‌ ఫర్‌ సౌత్‌ అని సీఎం వ్యాఖ్యానించార.ప్రధాని, కేంద్ర మంత్రులు ప్రకటించిన హామీలనే అడుగుతున్నాం. ఆర్‌ఆర్‌ఆర్‌, మెట్రో విస్తరణ, కేంద్ర ప్రాజెక్టులే ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. ఆయా అంశాలు సాధించురావాలనే ఆయనను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణలో 'భారత్‌ సమ్మిట్‌' పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమ్మిట్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నందన్నారు. భారత్‌ సమ్మిట్ కు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుందని.. ఆ విషయంపైనే విదేశాంగ మంత్రి జై శంకర్‌నను కలుస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో 'మిస్‌ వరల్డ్‌' పోటీలు జరగనున్నాయని.. నెలరోజుల పాటు దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయన్నారు. దీనికోసం రెండురోజుల్లో అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News