యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నా
డీఆర్‌ఐ విచారణలో రన్యారావు తెలిపినట్లు సమాచారం;
కన్నడ నటి రన్యారావుదుబాయ్ నుంచి బంగారం తీసుకొస్తూ బెంగళూరు డీఆర్‌ఐ అధికారులకు చిక్కారు. అక్రమ బంగారం రవాణపై అధికారుల విచారణలో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. బంగారం ఎలా అక్రమంగా తీసుకురావాలో తొలిసారి తాను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాని అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.తెలియని నంబర్ల నుంచి తనకు కాల్స్ వచ్చాయని దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 వద్ద బంగారం తీసుకుని బెంగళూరులో డెలివరీ చేయాలని చెప్పారని రన్యారావు చెప్పినట్లు సమాచారం. దుబాయ్ నుంచి ఇంతకుముందెన్నడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని రన్యారావు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ వీడియోలు చూసి స్మగ్లింగ్ చేయడం నేర్చుకున్నానని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి వెళ్లిపోయే చివరి క్షణంలో అధికారులు అరెస్టు చేశారు.