ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి
తమిళనాడులోని అన్నానగర్‌లో ఈ ఘటన;
Advertisement
తమిళనాడులోని అన్నానగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదన స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో డాక్టర్, న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజువారీ విధుల్లో భాగంగా డ్రైవర్ డాక్టర్ ఇంటికి వెళ్లగా తలుపులు మూసివేసి ఉన్నాయి. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. వేర్వేరు రూమ్‌ల్లో వారంతా ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అప్పుల భారం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement