సొంతపార్టీ నేతలపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బైటికి వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు;
Advertisement
సొంతపార్టీ నేతలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బైటికి వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొందరు బీజేపీ నేతలు తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా సమావేశమవుతున్నారు. రహస్య సమావేశాలు పెట్టుకుంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుందా? జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. గొప్పలు చెప్పుకొనే వాళ్లకు రిటైర్‌మెంట్ ఇస్తేనే పార్టీకి మంచిరోజులు. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్తలు ఇదే కోరుకుంటున్నారు అని రాజాసింగ్ అన్నారు.
Advertisement