ఈనెల 15నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఈనెల 15నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది;

Advertisement
Update:2025-03-13 15:00 IST

తెలంగాణలో ఈనెల 15నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాస్‌లు జరగుతాయి. ఏప్రిల్‌ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్‌ కొనసాగుతాయి. టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగిన పాఠశాలలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరగుతాయి. ఏప్రిల్‌ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్‌ కొనసాగుతాయి.

10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో దీంతో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు టాక్.

Tags:    
Advertisement

Similar News