అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.;

Advertisement
Update:2025-03-13 16:41 IST

సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడాన్ని తప్పుపడుతూ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. త‌మ‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. స‌భ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌దీశ్ రెడ్డి కేసీఆర్ ఛాంబ‌ర్‌లో కూర్చున్నారు. అక్క‌డ్నుంచి కూడా వెళ్లిపోవాల‌ని చీఫ్ మార్ష‌ల్ జ‌గ‌దీశ్ రెడ్డికి సూచించారు.

స‌భ నుంచి మాత్ర‌మే స‌స్పెండ్ చేశార‌ని బీఆర్ఎస్ స‌భ్యులు చీఫ్ మార్ష‌ల్‌కు సూచించారు. ప్ర‌తిప‌క్ష నేత ఛాంబ‌ర్‌లో కూర్చుంటే అభ్యంత‌ర‌మేంట‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించారు.దీంతో అటు నుంచి నేరుగా ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని అసెంబ్లీలో ప్రకటించారు. సస్పెండ్‌ అయిన సభ్యుడిని బయటకు పట్టాలని ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News