విజయసాయి వ్యవసాయం చేయరు..రాజకీయం మాత్రమే చేస్తారు : అమర్ నాథ్
వైసీపీ అధినేత జగన్‌పై విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేత అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు;
వైసీపీ అధినేత జగన్‌పై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న చేసిన కామెంట్స్‌పై మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు. సాయిరెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో? ఒకరి ప్రేమ పుడితేనే మరోకరిపై మనుసు విరుగుతుంది. వైసీపీలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలకు... ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు.
జగన్ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే ఇలా మాట్లాడేవారా? విజయసాయి వ్యవసాయం చేయరని, రాజకీయం మాత్రమే చేస్తారని నిన్న ఆయన చేసిన కామెంట్స్‌తో అర్థమైంది అని అమర్ నాథ్ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు వర్గాలు ఉన్నాయని... ఒకటి కూటమి వర్గం, రెండోది వైసీపీ వర్గం, మూడోది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం అని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించిన వాళ్లు ఇప్పుడు పార్టీలు మారుతున్నారని విమర్శించారు.