ఎర్రమట్టికోర్టులో మహాసమరం స్పానిష్ వండర్ తో సెర్బియన్ థండర్ ఢీ!

2022 గ్రాండ్ స్లామ్ సీజన్ రెండో టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ దశలోనే దిగ్గజాల మహాసమరానికి తెరలేచింది. పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టు వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ తో 13 ఫ్రెంచ్ టైటిల్స్ మొనగాడు ,5వ సీడ్ రాఫెల్ నడాల్ ఢీ కొంటున్నాడు. సీడింగ్స్ మార్పుతోనే సమరం… జోకోవిచ్ , నడాల్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు సెమీఫైనల్స్ […]

Advertisement
Update:2022-05-31 08:38 IST

2022 గ్రాండ్ స్లామ్ సీజన్ రెండో టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ దశలోనే దిగ్గజాల మహాసమరానికి తెరలేచింది.

పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టు వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాప్ సీడ్, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ తో 13 ఫ్రెంచ్ టైటిల్స్ మొనగాడు ,5వ సీడ్ రాఫెల్ నడాల్ ఢీ కొంటున్నాడు.

సీడింగ్స్ మార్పుతోనే సమరం…

జోకోవిచ్ , నడాల్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు సెమీఫైనల్స్ లేదా టైటిల్ సమరంలోనే తలపడుతూ ఉంటారు. అయితే..ప్రస్తుత సీజన్ ర్యాంకింగ్స్ లో మాజీ నంబర్ వన్ నడాల్ 5వ ర్యాంక్ కు పడిపోడంతో..ఫ్రెంచ్ ఓపెన్ పోరులో 5వ సీడ్ హోదాలో బరిలో నిలవాల్సి వచ్చింది. మరోవైపున ప్రపంచ నంబర్ వన్ జోకోవిచ్ టాప్ సీడ్ కు టైటిల్ వేటకు దిగాడు. ఈ ఇద్దరు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ విజయాలు సాధించడంతో…సెమీస్ లో చోటు కోసం క్వార్టర్ ఫైనల్ దశలోనే తలపడాల్సి వస్తోంది.

చమటోడ్చి నెగ్గిన స్పానిష్ బుల్..

క్లేకోర్టు టెన్నిస్ లో మొనగాడిగా పేరుపొందిన రాఫెల్ నడాల్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ విజయం కోసం 4 గంటల 21 నిముషాలపాటు చెమటోడ్చవలసి వచ్చింది. కెనడా ఆటగాడు ఫెలిక్స్ ఆగెర్ తో జరిగిన హోరాహోరీ సమరంలో నడాల్ 3-5, 6-3, 6-2, 3-6, 6-3తో విజేతగా నిలిచాడు.

17వ సంవత్సరాల తన ఫ్రెంచ్ ఓపెన్ కెరియర్ లో 13 టైటిల్స్ నెగ్గిన నడాల్ ఆడిన 111 సింగిల్స్ మ్యాచ్ ల్లో 109విజయాలు నమోదు చేయడం విశేషం.

జోకోవిచ్ తో 59వసారి ఢీ…

ప్రపంచ పురుషుల టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ప్రముఖంగా వినిపించే పేర్లలో జోకోవిచ్, నడాల్, ఫెదరర్ అందరికొంటే ముందుంటారు. అయితే..ఆల్ కోర్ట్ వండర్ జోకోవిచ్ తో క్లే కోర్టు స్పెషలిస్ట్ తలపడితే ఆ మజాయే వేరు. ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్ మ్యాచ్ తో ఈ ఇద్దరు మొనగాళ్లు 59వసారి తలపడబోతున్నారు.

గత 58 ముఖాముఖీ పోరులో జోకోవిచ్ 30 విజయాలు, నడాల్ 28 విజయాలతో ఉన్నారు.
అయితే…క్లేకోర్టు లో తలపడిన సమయంలో మాత్రం నడాల్ 19-8 విజయాల రికార్డుతో జోకోవిచ్ పైన ఆధిక్యంలో ఉన్నాడు. 2006 నుంచి ఫ్రెంచ్ ఓపెన్లో నడాల్, జోకోవిచ్ తలపడుతూ వస్తున్నారు. ప్రస్తుత సీజన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఈ ఇద్దరి మధ్యా 10వ పోరుకానుంది.

35 సంవత్సరాల నడాల్ కు ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ చేరడం గత 17 సంవత్సరాలలో ఇది 16వసారి.

ఫ్రెంచ్ ఓపెన్ క్లేకోర్టులో నడాల్ కు ఎదురైన మూడు పరాజయాలలో రెండు జోకోవిచ్ చేతిలోనే కావడం మరో రికార్డు. 2015 సీజన్ క్వార్టర్ ఫైనల్లోనూ, 2021 సీజన్ సెమీఫైనల్లోనూ నడాల్ పై జోకోవిచ్ సంచలన విజయాలు నమోదు చేశాడు.

నిరాశలో నడాల్…

జోకోవిచ్ తో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను రాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్వహించడం పట్ల నడాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాత్రివేళ మ్యాచ్ ఆడే సమయంలో పారిస్ లో ఉక్కబోత ఎక్కువగా ఉంటుందని, బంతి తేలిక పడటం తన ఆటకు అంత అనుకూలం కాదంటూ నడాల్ వాపోయాడు.

మరో క్వార్టర్ ఫైనల్ పోరులో టాప్ సీడ్ జోకోవిచ్ 6-1, 5-3, 6-3తో అర్జెంటీనా ఆటగాడు డియాగో ష్వార్జ్ మాన్ ను చిత్తు చేయడం ద్వారా తన కెరియర్ లో 15వసారి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకోగలిగాడు.
జోకోవిచ్ లాంటి గట్టి, ప్రపంచ మేటి ప్రత్యర్థితో తలపడటం తనకు గట్టి సవాలేనని, కాలిగాయంతో ఆడుతున్నా అత్యుత్తమంగా రాణించడానికి ప్రయత్నిస్తానని నడాల్ ప్రకటించాడు.
7-6 (12/10), 7-5.

Tags:    
Advertisement

Similar News