హామీలు అమలుచేయని చరిత్ర కాంగ్రెస్ ది

లక్షలాదిమందితో కని విని ఎరుగని రీతిలో 27న బీఆర్‌ఎస్‌ రజితోత్సవ నిర్వహిస్తామన్న మాజీ మంత్రి హరీశ్‌;

Advertisement
Update:2025-03-10 22:12 IST

బీఆర్ఎస్ పార్టీ 25 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజితోత్సవ సభ ను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. తన సలహా మేరకు సభను నిర్వహించేందుకు గతంలో 15 లక్షలమందితో మహా గర్జన నిర్వహించిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీదని, ఉద్యమాల ఖిల్లా వరంగల్ లో అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించామని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. హనుమకొండ హరిత హోటల్ లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతి పక్ష నేత మధుసూదన్ చారి,మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య,మాజీ చీఫ్ వీప్ దాస్యం వినయ్ భాస్కర్,ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి,పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్,శంకర్ నాయక్ లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...

ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించే సభకు రెండుచోట్ల స్థలాలను పరిశీలించామన్నారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేండ్ల పరిపాలనను నిదర్శనంగా రజోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని అన్నారు.సామాజిక,చారిత్రక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేపట్టి ప్రత్యేక తెలంగాణ సాధించామన్నారు.తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించడమే బీఆర్ఎస్‌ పార్టీ లక్ష్యమని, తెలంగాణ కోసం కేసీఆర్ చచ్చుడో,తెలంగాణ వచ్చుడో అని ఉద్యమం చేపట్టామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని పీఏం కిసాన్ గా, మిషన్ భగీరథ పథకాన్ని హార్ధర్కోజల్ అని, మిషన్ కాకతీయ లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో అద్భుతమైన ప్రగతిని అందించడం జరిగిందన్నారు.

రైతులకు రైతుబందు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రైతులకు సాగునీరు అందించడం ద్వారా దేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని అన్నారు. పర్ క్యాపిటల్ ఇన్‌కంలో దేశానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను ఎన్నింటినో అమలుచేశామని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్క ఉచిత బస్సు తప్ప, ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ కాలేదని ఇచ్చిన హామీలు అమలుచేయని చరిత్ర కాంగ్రెస్ దిఅని అన్నారు.11 వేల కోట్ల రూపాయలతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చామని, ఇవేగాక కేసీఆర్ కిట్, బ్యూటిషన్ కిట్టు సంచార పశువైద్యశాలలతో పాటు ప్రజల అవసరాలను గుర్తించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు.

రైతుల కోసం రైతు బందు, బీమా, తదితరులు పథకాలతో పాటు పల్లెలో చెరువు నింపి రైతుల పంటలకు సకాలంలో పంట దిగుమతి అందించేందుకు సహకరించిందన్నారు.ప్రజలంతా కేసీఆర్ ను చూడాలని,తన మాట వినాలని కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ జరిపేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.ప్రజలకు పని చేసేది ఎవరో, చెయ్యని వారు ఎవరో, పాలు ఏందో, నీళ్లు ఏందో, గట్టోడు ఎవరో, వట్టోడు ఎవరో ప్రజలకు తెలుసునని వారు గమనిస్తూ ఉన్నారని అన్నారు.తెలంగాణ ప్రజల గొంతుక బీ ఆర్ ఎస్ పార్టీ, తెలంగాణలో ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.

గోదావరి,కృష్ణ జలాలను ఆంధ్రకు తీసుకుపోతుంటే అధికారంలో ఉన్న,లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడింది, ఖమ్మం నల్లగొండ,మహబూబ్ నగర్ లో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది బీఆర్ఎస్ అని అన్నారు. రజితోత్సవ సభ కోసం చాలామంచి ఎక్సైజ్ చేసి ఎన్నో గ్రౌండ్స్ కూడా చూడవలసిన అవసరం ఉందని అన్నారు. మేమందరం కూడా ఇంకా జాగ్రత్తగా పరిశీలించి మరొకసారి కూడా వచ్చి ఫైనల్ చేస్తామని,అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం వరంగల్ లోనే ఉండి,మీడియాతో కూడా ఇంకా డీటెయిల్స్ లో మాట్లాడుతామని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నా పొడవు గురించి మాట్లాడారని, పొడవుగా ఉండటం నాకు దేవుడిచ్చిన వరమని,నేను వారి లాగా విమర్శించవచ్చు. కానీ విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా ఉన్నానని అన్నారు.నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సబబు కాదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలే నరేందర్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయని అన్నారు.రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అమ్ముడుపోయే చరిత్ర నీకు ఉంది అని,పాలన మీద దృష్టి పెట్టాలని,మొన్నటి ఎన్నికల్లో బడే బాయికి చోటే బాయ్ ఇచ్చిన గిఫ్ట్ గా అభివర్ణించారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,కార్పొరేటర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీశ్‌

ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం వరంగల్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావు ఉనికిచెర్ల, బట్టుపల్లి ప్రాంతాల్లోని సభా వేదిక స్థలాలను పరిశీలించారు. సభ ఏర్పాట్లపై పార్టీ నేతలతో చర్చించి అవసరమైన మార్పులు, సూచనలను చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు, పార్టీ శ్రేణులకు హరీశ్‌ రావు సూచించారు.

Tags:    
Advertisement

Similar News