నేతల భూకబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు
సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు;
Advertisement
అధికారాన్ని అడ్డంపెట్టుకొని మాజీ మున్సిపల్ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకొచ్చారు. పాసు పుస్తకాలను సృష్టించి పాత లేఅవుట్లను చెరిపేసి పంట పొలాలుగా సాగు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణిలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు.. లేఅవుట్లలో రోడ్ల కబ్జాలు, పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. మొత్తం 63 ఫిర్యాదులు అందుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. తుర్కయంజాల్, ప్రతాపసింగారం, బోడుప్పల్ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Advertisement