రిటైర్మెంట్‌పై రవీంద్ర జడేజా ఏమన్నాడంటే?
'అనవసరపు రూమర్స్ వద్దు.. థాంక్స్' అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో క్లారిటీ;
గత ఏడాది భారత్ టీ20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకు వీడ్కోలు పలికారు. దీంతో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సాధిస్తే ఈ ముగ్గురు వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అటువంటి ప్రకటనేమీ వెలువడకపోవడంతో ఫాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ స్పందించాడు. రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయవద్దని, వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తాను రిటైర్ కావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో జడేజా కోటా ఓవర్లు పూర్తికాగానే కోహ్లీ పరుగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకున్నాడు. దీంతో జడేజా వన్డేలకు వీడ్కోలు పలుతాకుతాడని కథనాలు వెలువడినాయి. దీనిపై జడేజా తాజాగా స్పందించాడు. 'అనవసరపు రూమర్స్ వద్దు.. థాంక్స్' అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో తాను మరింతకాలం వన్డేల్లో కొనసాగుతానని జడ్డూ క్లారిటీ ఇచ్చాడు.