వనాటు అందమైన దేశం. స్వర్గంలా ఉన్నది
లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోథం నపాట్ ఆదేశించిన కొన్నిగంటల్లోనే ఆయన ట్వీట్;
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోథం నపాట్ ఆదేశించిన విషయం విదితమే. ఈ క్రమంలో లలిత్ మోడీ కీలక ట్వీట్ చేశారు. 'వనాటు అందమైన దేశం. స్వర్గంలా ఉన్నది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే' అని అక్కడ దిగిన ఫొటోలను పోస్టు చేశారు. దీంతో ఇప్పటిక ఆయన పసిఫిక్ ద్వీప దేశానికి వెళ్లినట్లు సమాచారం. ఆయనకు జారీ అయిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని పనాటు ప్రధాని పేర్కొన్న కొన్ని గంటలకే సోషల్ మీడియా వేదికగా లలిత్ మోడీ పోస్టు పెట్టడం విశేషం.
ఐపీఎల్‌కు బాస్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో 2010లో లండన్‌కు పారిపోయిన అతను.. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. లలిత్ మోడీపై బిడ్-రిగ్గింగ్, మనీలాండరింగ్,1999 విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తిరిగి స్వదేశానికి రప్పించడానికి భారత్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన వనాటు పాస్‌పోర్టు పొందినట్లు తెలిసింది.