నేడు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం భేటీ.. హాజరుకానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు;
Advertisement
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేడు బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఈ భేటీ జరగనున్నది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవుతారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున చర్చల సందర్బంగా ప్రస్తావించాల్సిన అంశాలు, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టే అంశంపై బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో దృష్టి సారించనున్నారు.
Advertisement