రేపటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

ఏర్పాట్లపై సభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష;

Advertisement
Update:2025-03-11 10:14 IST

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనసభ, మండలిలో ఏర్పాట్లపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి స్పీకర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ హుందాతనాన్ని పెంచేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌కు సంబంధించిన సమావేశాలు కాబట్టి ఎక్కువ రోజులు జరుగుతాయని స్పీకర్‌ అభిప్రాయపడ్డారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో అందించాలని స్పీకర్‌ సూచించారు. చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి మంత్రులు, సభ్యులకు సమాచారం అందించి సహకరించాలన్నారు. సభ్యులు సజావుగా సమయానికి శాసనసభకు చేరుకోవడానికి ట్రాఫిక్‌ ఇబ్బందులు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  

Tags:    
Advertisement

Similar News