రేవంత్ మీటింగ్‌కు వెళ్లొద్దు..! సీనియర్ల నిర్ణయం..!
కాంగ్రెస్ మార్కు రాజకీయాలే అంత.. వాళ్లకు ప్రతిపక్షాలే అక్కర్లేదు. సొంతపార్టీలోనే విమర్శలు ఎదురవుతుంటాయి. ఎవరైనా లీడర్‌గా ఎదుగుతున్నారంటే.. అదే పార్టీలోని వాళ్లు ఎదగనివ్వరు. పక్క నియోజకవర్గంలో నిలబడ్డ తమ పార్టీ ఎమ్మెల్యేనే ఓడించాలని చూస్తుంటారు. వర్గపోరుకు, గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. అందుకే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ‘పాదయాత్ర’ పై సీనియర్ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. రేపు రావిరాలలో జరిగే రేవంత్ బహిరంగ సభకు వెళ్లొద్దని కాంగ్రెస్ సీనియర్లు నిర్ణయం తీసుకున్నారట. ఈ నెల 7న […]
కాంగ్రెస్ మార్కు రాజకీయాలే అంత.. వాళ్లకు ప్రతిపక్షాలే అక్కర్లేదు. సొంతపార్టీలోనే విమర్శలు ఎదురవుతుంటాయి. ఎవరైనా లీడర్‌గా ఎదుగుతున్నారంటే.. అదే పార్టీలోని వాళ్లు ఎదగనివ్వరు. పక్క నియోజకవర్గంలో నిలబడ్డ తమ పార్టీ ఎమ్మెల్యేనే ఓడించాలని చూస్తుంటారు. వర్గపోరుకు, గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు. అందుకే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ‘పాదయాత్ర’ పై సీనియర్ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. రేపు రావిరాలలో జరిగే రేవంత్ బహిరంగ సభకు వెళ్లొద్దని కాంగ్రెస్ సీనియర్లు నిర్ణయం తీసుకున్నారట.
ఈ నెల 7న రేవంత్‌రెడ్డి .. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రైతు భరోసా దీక్షను చేపట్టారు. సాయంత్రం వరకు దీక్షలో కూర్చున్న రేవంత్ అనూహ్యంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. దీంతో ఆ రోజు నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. అచ్చంపేట.. కల్వకుర్తి నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో రేవంత్ పాదయాత్ర సాగింది. ప్రజల నుంచి కూడా స్పందన బాగానే వచ్చింది. అయితే ఈనెల 16న అంటే రేపు రావిరాలలో భారీ బహిరంగసభ ఏర్పాటుచేయాలని రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ సహా కీలక నేతలను పిలవాలని ఆయన భావించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ల నుంచి రేవంత్‌కు వ్యతిరేకత వస్తున్నది.
అసలు పాదయాత్రకు రేవంత్‌రెడ్డి అధిష్ఠానం అనుమతి తీసుకోలేదని సీనియర్లు వాదిస్తున్నారు. కేవలం ఎవరి నియోజవర్గాల్లో వారు పాదయాత్ర చేసుకోవాలని అధిష్ఠానం సూచిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం తన పార్లమెంట్ నియోజకవర్గాన్ని దాటి .. మరోచోట పాదయాత్ర చేస్తున్నారని వాళ్లు విమర్శిస్తున్నారు. నిజానికి అచ్చంపేట రేవంత్ సొంత నియోజకవర్గమే అయితే ఆ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఆయన మరోచోట పోటీచేస్తున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఇదిలా ఉంటే ‘రైతన్నా.. నేటి నా గొంతులో ఆవేదన, రేపటి నీ బతుకులో వాస్తవం.. అందుకే.. రేపటి వరకు వద్దు.. ఈ రోజే చరిత మార్చేద్దాం రా.. తరలిరా.. రావిరాలకు’’.. అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.