ఆగ‌ని ఐటీ దాడులు.... చంద్ర‌బాబుకు ద‌డ‌....

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి. గాయత్రినగర్ కంచుకోట అపార్ట్‌మెంట్‌లో ఐదోరోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే కీలక పత్రాలు సేకరించిన ఐటీ అధికారులు..వాటి వివ‌రాల‌ను రాబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ని 96 గంటలుగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఆయ‌న‌కు ఉన్న ఆస్తులు ఏంటి? ఆయ‌న ఏఏ వ్య‌వ‌హారాలు చూసేవారు? ఆస్తులు ఎలా సంపాదించారు? చ‌ంద్ర‌బాబుతో ఆయ‌న‌కు ఉన్న సంబంధాలు ఏంటి? గ‌త ఐదేళ్ల‌లో ఎక్క‌డెక్క‌డ ఆస్తులు […]

Advertisement
Update:2020-02-10 06:01 IST

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి. గాయత్రినగర్ కంచుకోట అపార్ట్‌మెంట్‌లో ఐదోరోజు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే కీలక పత్రాలు సేకరించిన ఐటీ అధికారులు..వాటి వివ‌రాల‌ను రాబ‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ని 96 గంటలుగా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఆయ‌న‌కు ఉన్న ఆస్తులు ఏంటి? ఆయ‌న ఏఏ వ్య‌వ‌హారాలు చూసేవారు? ఆస్తులు ఎలా సంపాదించారు? చ‌ంద్ర‌బాబుతో ఆయ‌న‌కు ఉన్న సంబంధాలు ఏంటి? గ‌త ఐదేళ్ల‌లో ఎక్క‌డెక్క‌డ ఆస్తులు ఎలా కొన్నారు? అనే వివ‌రాల‌ను డాక్యుమెంట్ల ఆధారంగా సేకరిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఐటీ దాడులంటే ఏదో ఒక రోజు రెండు రోజులు జ‌రుగుతాయి. కానీ ఐదు రోజులుగా కొనసాగుతుండడంతో టీడీపీ నేత‌ల్లో ఉత్కంఠ నెల‌కొంది.

ఇటు చంద్రబాబు క్యాంపులో ద‌డ మొద‌లైంది. ఈ దాడుల త‌ర్వాత కీల‌క అరెస్టులు ఉంటాయా? లేక ఈ స‌మాచారంతో మ‌రికొంత మంది మీద దాడులు చేస్తారా? ఐటీ సోదాల త‌ర్వాత ఏం జ‌ర‌గ‌బోతుంది? అనే టెన్ష‌న్ టీడీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది.

మ‌రోవైపు బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌ ఇళ్లల్లో నిరంతరాయంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆదాయ పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజధాని అమరావతి నిర్మాణాలు చేప‌ట్టిన షాపూర్జీ ప‌ల్లోంజి కంపెనీ…. సబ్‌ కాంట్రాక్టుల రూపంలో దక్కించుకున్న పనులను చేయకపోయినా దొంగ ఇన్వాయిస్‌ల రూపంలో నగదును బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి హవాలా, మనీల్యాండరింగ్‌ రూపంలో తరలించినట్లు తెలుస్తోంది. ఇలా బ్యాంకుల నుంచి డ్రా చేసిన మొత్తం ఎప్పుడు, ఎక్కడకు చేర్చారనే విషయాన్ని బ్యాంక్‌ స్టేట్‌మెంట్ల ఆధారంగా అడుగుతూ వివరాలు నమోదు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఢిల్లీ నుంచి వచ్చిన ఆదాయ పన్ను శాఖ అధికార బృందాలు విడతల వారీగా విచారిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి వీరి ఇళ్లు, కార్యాలయాల్లోకి బయటి వ్యక్తులను, బంధువులను కూడా రానివ్వకుండా విచారణ చేస్తున్నారు. అలాగే ఉత్తర తెలంగాణకు చెందిన మరో రాజకీయ నాయకుడి ఇంటిపైనా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News