టీమిండియాకు ఆదిలోనే హంసపాదు

టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి దెబ్బ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓపెనర్ పృథ్వీ షాకు గాయం ఆస్ట్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే…టీమిండియాకు గట్టి దెబ్బతగిలింది. యువఓపెనర్ పృథ్వీ షా కాలిమడమకు గాయమయ్యింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి…టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న టాప్ ర్యాంకర్ టీమిండియాకు….తొలిటెస్ట్ ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ మ్యాచ్ లో…. అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ఆసీస్ తో జరిగే తొలిటెస్ట్ కు సన్నాహకంగా […]

Advertisement
Update:2018-11-30 10:15 IST
  • టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి దెబ్బ
  • ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓపెనర్ పృథ్వీ షాకు గాయం

ఆస్ట్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే…టీమిండియాకు గట్టి దెబ్బతగిలింది. యువఓపెనర్ పృథ్వీ షా కాలిమడమకు గాయమయ్యింది.

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి…టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న టాప్ ర్యాంకర్ టీమిండియాకు….తొలిటెస్ట్ ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది.

ప్రాక్టీస్ మ్యాచ్ లో….

అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ఆసీస్ తో జరిగే తొలిటెస్ట్ కు సన్నాహకంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో…క్రికెట్ ఆస్ట్రేలియా లెవెన్ జట్టుతో జరుగుతున్న నాలుగురోజుల మ్యాచ్ లో పృథ్వీ షా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాయి.

వర్షం కారణంగా తొలిరోజు ఆట రద్దయిన ఈమ్యాచ్ రెండోరోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్ పృథ్వీ షా సైతం మెరుపు హాఫ్ సెంచరీ సాధించి… తొలిటెస్ట్ కు తాను పూర్తి స్థాయిలో సిద్ధమని ప్రకటించాడు.

అయితే…ప్రత్యర్థిజట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో….లాంగ్ ఆన్ బౌండ్రీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పృథ్వీ షా….క్యాచ్ పట్టడానికి ప్రయత్నించి…కాలిమెలిక పడటంతో గాయపడ్డాడు.

కాలమడమ గాయంతో విలవిలలాడిపోయాడు. దీంతో టీమ్ ఫిజియో, సహాయ సిబ్బంది వచ్చి…పృథ్వీ షాను…చేతుల మీద మోసుకొంటూ డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకెళ్లారు.

తొలిటెస్ట్ కు షా దూరం…

అడిలైడ్ ఓవల్ వేదికగా ప్రారంభమయ్యే తొలిటెస్ట్ కు …పృథ్వీ షా దూరం కాక తప్పని పరిస్థితి ఏర్పడిందని టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.

గాయం తీవ్రత గురించి… అన్నిరకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రకటించనున్నట్లు ఫిజియో తెలిపారు. కనీసం రెండోటెస్ట్ మ్యాచ్ నాటికి… పృథ్వీ షా పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని ఫిజియో తెలిపారు.

విజయ్- రాహుల్ జోడీతో ఓపెనింగ్…

పృథ్వీ షా గాయం తో….మరో యువఓపెనర్ రాహుల్ తో కలిసి సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ …టీమిండియా ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

టెస్ట్ క్రికెట్లోకి ఇటీవలే అరంగేట్రం చేసి…నిలకడగా రాణిస్తున్న సమయంలో పృథ్వీ షాకు గాయం కావడం… దురదృష్టం కాక మరేమిటి.

Tags:    
Advertisement

Similar News