జనసేన వైపు కాకుండా.... వైసీపీకి ఎందుకు వెళ్ళినట్టు?

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఆశలన్నీ కాపుల మీదే ఉన్నాయనేది బహిరంగ సత్యం. తనను కాపు కులానికి పరిమితం చేయవద్దు అని పవన్ చెప్పుకోవచ్చు గాక.. కానీ.. పవన్ కల్యాణ్ రాజకీయ డ్రీమ్స్ అన్నీ కాపుల మీదే డిపెండ్ అయ్యాయి. సొంత క్యాస్ట్ మీద పవన్ కు ఉన్న పట్టు ఎంత? పవన్ కల్యాణ్ ఏ మేరకు తన కులాన్ని ప్రభావితం చేయగలడు? తన వాళ్ల ఓట్లను ఏ మేరకు పొందగలడు? అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. ఆ […]

Advertisement
Update:2018-11-14 02:00 IST

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఆశలన్నీ కాపుల మీదే ఉన్నాయనేది బహిరంగ సత్యం. తనను కాపు కులానికి పరిమితం చేయవద్దు అని పవన్ చెప్పుకోవచ్చు గాక.. కానీ.. పవన్ కల్యాణ్ రాజకీయ డ్రీమ్స్ అన్నీ కాపుల మీదే డిపెండ్ అయ్యాయి. సొంత క్యాస్ట్ మీద పవన్ కు ఉన్న పట్టు ఎంత? పవన్ కల్యాణ్ ఏ మేరకు తన కులాన్ని ప్రభావితం చేయగలడు? తన వాళ్ల ఓట్లను ఏ మేరకు పొందగలడు? అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే.

ఆ సంగతలా ఉంటే.. కనీసం కాపు నేతలు అయినా పవన్ కల్యాణ్ వెంట నడుస్తారా? అనేది మరో ప్రశ్నార్థకం.

అదలా ఉంటే.. తాజాగా మాజీ మంత్రి రామచంద్రయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆసక్తిదాయకమైన అంశం. ఈయన బలిజ కులస్తుడు. రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు. ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన వ్యక్తి. మంచి మాటకారి. ఇలాంటి వ్యక్తి జనసేన వైపు చూడకపోవడం విశేషం. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు.

ఈయన జనసేనలో చేరతాడని అంతా అనుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ మీద నమ్మకం లేదో ఏమో కానీ…. వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. పవన్ కల్యాణ్ సొంత కులం నేతలను కూడా గట్టిగా ప్రభావితం చేయలేకపోతున్నాడని పరిశీలకులు అంటున్నారిప్పుడు.

Tags:    
Advertisement

Similar News