గుత్తా, చామకూర ఎటువైపు కూర్చుంటారు?
నిన్న మొన్నటి దాకా వారు ప్రతిపక్ష పార్టీ నేతలు. పార్టీ మారడంతో కండువాలు మార్చుకున్నారు. వారెవరంటే.. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాల్కాజిగిరి టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి. వీరిద్దరూ 2014లో ఆయా పార్టీల నుంచి గెలిచి ఇటీవలే కారెక్కారు. ఈరోజు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ ఇద్దరు ఎంపీలు మొన్నటిదాకా వారి వారి పార్టీల ఆధారంగా కేటాయించిన సీట్లలోనే కూర్చున్నారు. మరిఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి […]
Advertisement
నిన్న మొన్నటి దాకా వారు ప్రతిపక్ష పార్టీ నేతలు. పార్టీ మారడంతో కండువాలు మార్చుకున్నారు. వారెవరంటే.. నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాల్కాజిగిరి టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి. వీరిద్దరూ 2014లో ఆయా పార్టీల నుంచి గెలిచి ఇటీవలే కారెక్కారు. ఈరోజు నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ ఇద్దరు ఎంపీలు మొన్నటిదాకా వారి వారి పార్టీల ఆధారంగా కేటాయించిన సీట్లలోనే కూర్చున్నారు. మరిఇప్పుడు ఎక్కడ కూర్చుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి ఈ ఇద్దరు ఎంపీలు ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ ఎస్‌లో చేరారు. వీరికి స్పీకర్ ప్రత్యేకంగా సీట్లు కేటాయించరు. అదే తెలంగాణ అసెంబ్లీ అయితే పరిస్థితి వేరు .. పార్టీశాఖ విలీనం పేరిట… తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను తమతోపాటు కూర్చుండబెట్టుకుంది టీఆర్ ఎస్. సాంకేతికంగా టీడీపీ పార్టీ విలీనం పూర్తికావడంతో స్పీకర్ కూడా వారికి అధికార పార్టీ పక్షాన సీట్లు కేటాయించారు. దాంతో ప్రతిపక్షాలు గోల చేసినా.. అధికారపార్టీ తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది.
మరి ఇప్పుడు సీన్ ఢిల్లీకి మారింది. ఇది పార్లమెంటు. ఇక్కడలా కుదరదు. పార్టీ మారిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఆయా పార్టీల నేతలు స్పీకర్‌కు తప్పకుండా ఫిర్యాదు చేస్తారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ చేసినా చేయకున్నా.. టీడీపీ మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయబోదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఏపీ నుంచి వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలను తమ పార్టీలో చేర్చుకున్న టీడీపీ తెలంగాణలో చామకూర మల్లారెడ్డి పార్టీ ఫిరాయింపు అనైతికం.. అనే నైతిక అర్హత కోల్పోయింది. దీంతో టీడీపీ ఫిర్యాదు చేసే సమస్యే ఉత్పన్నం కాదు. మరి కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కొత్తగా టీఆర్ ఎస్‌లో చేరిన ఎంపీలంతా.. ఇప్పుడు ఎటువైపు కూర్చుంటారు? అన్న విషయాలు ప్రశ్నార్దకంగా మారాయి.
Advertisement