ఆర్టీసీ తాత్కాలిక విభజన
ఎట్టకేలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను రెండు ముక్కలు చేశారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా బస్ భవన్‌ను రెండుగా చీలుస్తూనే కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకోవలసి వస్తే ప్రస్తుతం ఎండీకి ఆ అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. శాశ్వత విభజనకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభాగానికి ఏ బ్లాకును, తెలంగాణ విభాగానికి బి బ్లాకును కేటాయించింది. ఇక నుంచి ఉభయులూ తమ […]
Advertisement
ఎట్టకేలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను రెండు ముక్కలు చేశారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా బస్ భవన్‌ను రెండుగా చీలుస్తూనే కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకోవలసి వస్తే ప్రస్తుతం ఎండీకి ఆ అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. శాశ్వత విభజనకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విభాగానికి ఏ బ్లాకును, తెలంగాణ విభాగానికి బి బ్లాకును కేటాయించింది. ఇక నుంచి ఉభయులూ తమ తమ పరిధిలో నిర్ణయాలు తీసుకుని పని చేస్తారని తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు నెలల పాటు ఆర్టీసీలో సమ్మెలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.-పీఆర్.
Advertisement