గ్రామ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై టమాటాలతో దాడి
గ్రామ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టొమాటోలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
Advertisement
గ్రామ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టొమాటోలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ పరిధిలో జరిగింది. కమలాపూర్లో గ్రామసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పాల్గోన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్దం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను ఎమ్మెల్యే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఎటువంటి అభివద్ది జరగలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలుటామాటాలు, కోడి గుడ్లతో దాడి చేశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గన్ మెన్లు ఆయనను వేదిక మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలు, నాయకులను చెదరగొట్టారు.
Advertisement