రేవంత్‌రెడ్డిలా నేను పార్టీలు మారలేదు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్న కిషన్‌రెడ్డి

Advertisement
Update:2025-02-24 21:47 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, కేటీఆర్‌లను బీజేపీ కాపాడుతున్నదంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. ట్యాపింగ్‌ కేసులో సమగ్రంగా విచారణ జరపాలని బీజేపీ హైకోర్టు పిటిషన్‌ వేసిందన్నారు. సీబీఐకి ఈ కేసును అప్పగిస్తే విచారణ ముందుకెళ్తుందన్ని తెలిపారు. చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. సోమవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనను విమర్శించే అర్హత సీఎం రేవంత్‌ రెడ్డికి లేదన్న ఆయన.. కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే బీజేపీపై విమర్శలు చేస్తున్నారన్నారు. తనపై, బండి సంజయ్‌పై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిలా తాను పార్టీలు మారలేదన్నారు. భవిష్యత్తులో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News