ఓటమి భయం సీఎం రేవంత్‌లో కనిపిస్తున్నది

సర్వేలన్నీ కాంగ్రెస్‌కు మూడో స్థానమేనని తేల్చేశాయన్న బండి సంజయ్‌

Advertisement
Update:2025-02-24 19:19 IST

గొర్రెల స్కామ్‌, ఫార్ములా ఈ-రేసు కేసులు పెడితే.. పేపర్లన్నింటినీ ఈడీ తీసుకెళ్లింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును అడ్డుపెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ కేసులో నిందితులుగా ఉన్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఎందుకు భారత్‌కు రప్పించడం లేదు. వాళ్లను మన దేశానికి రప్పించండి. ట్యాపింగ్‌ కేసులో ఏం చేయాలో మేం అది చేస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి మంచిర్యాలలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ దీనిపై స్పందించారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. మీరు విచారణ చేస్తూ.. మమ్మల్ని అరెస్టు చేయమంటారా? మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని మాపై బురద చల్లుతారా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ స్కాములు సీబీఐకి అప్పగిస్తే దోషులను జైలు వేస్తామన్నారు. ఓటమి భయం సీఎం రేవంత్‌లో కనిపిస్తున్నది. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు మూడో స్థానమేనని తేల్చేశాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా పోయేది ఏమీ లేదంటున్నారు. ఫలితంపై ఢోకా లేకుంటే ప్రచారానికి ఎందుకు వచ్చినట్లు అని ప్రశ్నించారు. 51 శాతమున్న బీసీలను 46 శాతానికి తగ్గించి బుకాయిస్తారా? బీసీల్లో ముస్లింలను కలిపి.. మేలు చేసినట్లు అబద్ధాలాడుతారా? అని ధ్వజమెత్తారు. 

Tags:    
Advertisement

Similar News