గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్
రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం
లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపడానికి హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు-2025 జరగుతున్నది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్ మారింది. ఈ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో నిపుణులు ఉన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ రాబోతున్నాయి. హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణల కేంద్రంగా మారుస్తాం. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని సీఎం అన్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. లైఫ్ సైన్సెస్ రంగంలో క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి మంచి పేరున్నది. విదేశీ యూనివర్సిటీ నిపుణులు, ఫార్మా రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఫార్మా రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తున్నది. ఏఐ, క్వాంటమ్, రోబోటిక్స్ సాయంతో వైద్య రంగం రూపురేఖలు మారుతున్నాయి. ఇక్కడి ఎకో సిస్టమ్ అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తున్నది. మా ప్రభుత్వ విధానాలు చూసి అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. దేశంలోనే ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా తెలంగాణ మారింది. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో మిగతా రాష్ట్రాల కంటే ముందున్నాం. హైదరాబాద్‌కు వచ్చే కంపెనీల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయిన సీఎం తెలిపారు.