మార్చి ఒకటి నుంచి ఆ జిల్లాలో రేషన్ కార్డులు పంపిణీ
మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మార్చి 1న నుంచి మొదటిగా రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ ప్రజలకు అందించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నూతన జిల్లాల ప్రకారం హైదరాబాద్- 285, వికారాబాద్ జిల్లా- 22 వేలు, నాగర్‌కర్నూల్ జిల్లా- 15 వేలు, నారాయణపేట జిల్లా- 12 వేలు, వనపర్తి జిల్లా- 6 వేలు, మహబూబ్‌నగర్ జిల్లా- 13 వేలు, గద్వాల్ జిల్లా- 13 వేలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా- 6 వేలు, రంగారెడ్డి జిల్లా- 24 వేలు చొప్పున లక్ష కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని దీనికి చివరి గడువంటూ ఏమి లేదని అధికారులు వెల్లడించారు.
2017 నుంచి తెలంగాణలో నూతన రేషన్ కార్డులు జారీ చేయలేదు. ఈ పదేళ్లలో లక్షల మంది పెళ్లిళ్లు చేసుకుని వేరుకాపురాలు పెట్టారు. ప్రభుత్వ పథకాలు ఏమైనా అందాలంటే రేషన్ కార్డులు కీలకం. కార్డులు లేక అనేక మంది సంక్షేమ పథకాలను కోల్పోయిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు నూతన కార్డులు జారీ చేస్తున్నట్లు తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనవరి 26న కూడా 16,900 కుటుంబాలకు రేషన్ కార్డులు మంజూరు చేశారు