8 మంది ఆచూకీ కోసం అత్యాధునిక ఎండోమోడ్‌ కెమెరాలు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్‌

Advertisement
Update:2025-02-25 11:39 IST

శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ ప్రమాదంలో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. టన్నెల్‌ వద్దకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆయనతోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా ఉండనున్నారు. మరోవైపు టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు రోజురోజుకు కష్టంగా మారుతున్నాయి. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా పెరుగుతున్నది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూచీ కోసం అత్యాధునిక ఎండోమోడ్‌ కెమెరాలను లోపలికి పంపారు. 9 వేర్వేరు బృందాలుగా 600 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 72 గంటలు గడిచినా ఎనిమిది మంది ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన వ్యక్తమౌతున్నది. 

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌ 14 కి.మీ వద్ద ప్రమాదం జరిగింది. 13.7 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు చేరుకున్నాయి. టన్నెల్‌ 10.95 కి.మీ. వద్ద ఒకటిన్నర, 11.9 కిలోమీటర్‌ అడుగుల ఎత్తులో నీరు ఉన్నది. 13 కిలోమీటర్‌ వద్ద టీబీఎం వెనుకభాగం పరికరాలు దెబ్బతిన్నాయి. టీబీఎం వెనుక పేరుకు బురదతో కన్వేయర్‌ బెల్‌ పనిచేయడం లేదు. వంద మీటర్ల పూడిక తర్వాత 6 అడుగుల ఎత్తులో మట్టి, రాళ్లతో పూడిపోయింది. 14 కిలోమీటర్‌ వద్దే 8 మంది చిక్కుకుపోయారని అంచనా వేస్తున్నారు. ఎండోస్కోపిక్‌ రోబోటిక్‌ పుష్‌ కెమెరాలను తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. దెబ్బతిన్న టీబీఎం నుంచి ముందుకు వెళ్లలేక పుష్‌ కెమెరా బృందాలు వెనుదిరిగాయి. 

Tags:    
Advertisement

Similar News