ఎల్లుండి ఎస్ఎల్‌బీసీ సందర్శనకు బీఆర్ఎస్ నేతలు

ఎల్లుండి ప్రమాదం జరిగిన ఎస్ఎల్‌బీసీ సందర్శనకు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్తమని మాకు పోలీసులు ఆటంకం కలిగించొద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Advertisement
Update:2025-02-25 18:05 IST

ఎస్ఎల్‌బీసీ ఘటన చాలా దురదృష్టకరమని చాలా బాధకరమని బీఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్ఎల్‌బీసీ సొరంగంలోనే చిక్కుకుపోయిన 8 మంది క్షేమంగా తిరిగి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఎల్లుండి ప్రమాదం జరిగిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ నేతల సందర్శనకు వెళ్లారని, పోలీసులు తమను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

అటు ఈ సంఘటనపై జుడీషీయల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గత మూడ్రోజులుగా కార్మికులు సొరంగంలోనే ఉండిపోయారు. వారు బతికి ఉన్నారా..? లేదా జరగరానిది ఏదైనా జరిగిందా? అనే విషయం కూడా ఇంతవరకు తెలియరాలేదు. సహాయక చర్యలు మాత్రం మూడ్రోజులుగా నిర్వరామంగా కొనసాగుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News