కేంద్రంలో సంకీర్ణం.. అందులో మన పాత్ర సుస్పష్టం

కేంద్రం నుంచి అద‌నంగా డ‌బ్బులు తెచ్చుకోవాలన్నా, వాళ్లు ర‌ద్దు చేసిన అన్నింటిని తిరిగి ప్రారంభించాలన్నా.. కేంద్ర ప్రభుత్వంలో మన పాత్ర ఉండాల్సిందేనన్నారు కేటీఆర్. తెలంగాణలో తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, అందులో అనుమానమేం లేదన్నారు కేటీఆర్.

Advertisement
Update:2023-08-07 22:56 IST

2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని చెప్పారు మంత్రి కేటీఆర్. అదే సమయంలో కాంగ్రెస్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. వచ్చేది కచ్చితంగా సంకీర్ణమేనని చెప్పారు మంత్రి కేటీఆర్. కేంద్రంలో ఈ దఫా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, అందులో బీఆర్ఎస్ పాత్ర తప్పకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కడం వల్ల రాష్ట్రాలకు ఉపయోగం లేదని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ‌లో ఇంటిరీయ‌ర్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాల‌జీ ఏర్పాటు కావాలంటే మ‌న ప్ర‌భుత్వం ఉండాలన్నారు. నేష‌న‌ల్ టెక్స్‌ టైల్ రీసెర్చ్ ఇన్‌ స్టిట్యూట్ ఏర్పాటు కావాలంటే కేంద్రంలో మ‌న పాత్ర ఉండాలని చెప్పారు. కేంద్రం నుంచి అద‌నంగా డ‌బ్బులు తెచ్చుకోవాలన్నా, వాళ్లు ర‌ద్దు చేసిన అన్నింటిని తిరిగి ప్రారంభించాలన్నా.. కేంద్ర ప్రభుత్వంలో మన పాత్ర ఉండాల్సిందేనన్నారు కేటీఆర్. తెలంగాణలో తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, అందులో అనుమానమేం లేదన్నారు కేటీఆర్.

నేతన్నల గురించి వారికి తెలియదు..

చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్ట‌మొద‌టి ప్ర‌ధాని మోదీ అని మండిప‌డ్డారు మంత్రి కేటీఆర్. చేనేత వ‌ద్దు.. అన్నీ ర‌ద్దు.. అనేలా కేంద్రం తీరు ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం చేనేత‌ కార్మికులపై మ‌రిన్ని భారాలు వేస్తుంద‌న్నారు. ఇప్పుడున్న కేంద్ర ప్ర‌భుత్వానికి నేత‌న్న‌ల గురించి తెలియదన్నారు. అన్ని వర్గాల వారు కేంద్రం తీరుతో విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెబుతారని అన్నారు మంత్రి కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News