తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా
తెలంగాణ శాసన సభ ఎల్లుండికి వాయిదా పడింది.;
Advertisement
తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ జరిగింది. రుణమాఫీ, బకాయిల చెల్లింపు అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పోటాపోటీ విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ ప్రసంగ తీర్మానంపై సమాధానమిచ్చారు. అనంతరం శాసన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎల్లుండికి వాయిదా వేశారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు తెస్తామని సీఎం తెస్తామని రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్ తెచ్చే బాధ్యత నాదన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సూచించిన వివరాలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారని… తెలిపారు. లాల్ దర్వాజా అభివృద్ధికి నిధులు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. మీరు ఏ సమస్య చెప్పినా చేస్తానంటూ ప్రకటించారు.
Advertisement