యూట్యూబ్ జర్నలిస్టులను గుడ్డలు ఊడదీసి కొడుతా : సీఎం రేవంత్

నన్ను తిడుతూ వీడియోలు పెట్టినోళ్లను యూట్యూబర్లను బట్టలిప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తాని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు;

Advertisement
Update:2025-03-15 15:29 IST

తెలంగాణ శాసన సభలో యూట్యూబర్లను సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అవమానించారు. యూట్యూబ్ జర్నలిస్టులను క్రిమినల్స్ కింద చూస్తామని తెలిపారు. నన్ను తిడుతూ వీడియోలు పెట్టినోళ్లను తోడికల్ తీస్తా, బట్టలిప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తా ముఖ్యమంత్రి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకమీదట యూట్యూబ్ జర్నలిజం పేరిట ఇష్టం వచ్చినట్లు వాగితే ఊరుకోమని స్పష్టంచేశారు. జర్నలిజం పేరిట కుటుంబ సభ్యులను, ఆడవాళ్లను తిడతారా? వాళ్ల ఇంట్లో కూడా తల్లి, చెల్లి, భార్య ఉంటారు కదా? ఇలాంటి వాళ్లను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మీద సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ జర్నలిస్టులను క్రిమినల్స్ కింద పరిగణిస్తామని, తప్పుడు వార్తలు రాసినా, పిచ్చిగా వాగితే గుడ్డలు ఊడతీసి కొడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. నాకూ చీమూనెత్తురు ఉంది. అన్నింటినీ ఓర్చుకోలేను. చట్టప్రకారమే వారిని శిక్షిస్తాం. దీనిపై ఓ చట్టం తెస్తామని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు. కాగా, ఇటీవల యూట్యూబ్ జర్నలిజం పేరిట సీఎం రేవంత్‌ను అసభ్యంగా దూషించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేయగా.. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News