త్వరలోనే బేగంపేట రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తాం

బేగంపేట రైల్వేస్టేషన్‌లో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి;

Advertisement
Update:2025-03-15 14:09 IST

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్నదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మరో పది శాతం పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ. 2,655 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయి. మరో రూ. 12 కోట్లతో రెండో విడత పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్‌ ద్వారా స్వచ్ఛ రైల్వేస్టేషన్‌ పేరుతో వినూత్న మార్పులను తీసుకొచ్చారు. చర్లపల్లి రైల్వే ష్టేషన్‌ను కూడా అధునాతనంగా నిర్మించుకుని ప్రారంభించుకున్నాం. బేగంపేట రైల్వేస్టేషన్‌లో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News