తెలంగాణ సచివాలయంపై డ్రోన్ కలకలం.. ఇద్దరు అరెస్ట్

తెలంగాణ సచివాలయంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.;

Advertisement
Update:2025-03-15 14:44 IST

తెలంగాణ సచివాలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియట్ అధికారులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రోన్ ఎగరేసిన ఇద్దరినీ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వంశీ, నాగరాజు అనే ఇద్దరినీ సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతో సెక్రటేరియట్ అవుట్ పోస్ట్, లాన్ ఏరియా నిందితులు చిత్రీకరించినట్లు సమాచారం. నిందితులు ఇక, సెక్రటేరియల్‌ అవుట్‌ పోస్టుతో పాటు సచివాలయం లాన్‌ ఏరియాను డ్రోన్‌తో చిత్రీకరించినట్టు పోలీసులు గుర్తించారు. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News