తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒవైసీ దేశం వదిలి వెళ్లాడు : రాజాసింగ్
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దేశం వదిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు. లేదా తాను కమలం పార్టీలో జాయిన్ అవుతానని అసదుద్దీన్ ఒవైసీ తమ నేతల కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. రంజాన్ సందర్బంగా అసదుద్దీన్ ఒవైసీ లేనిపోని కామెంట్స్ చేస్తున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మతకల్లోలు జరగొద్దని నిన్న ఒక్కరోజు ఇంట్లో నమాజః్ చేసుకోమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తే తప్పు పట్టారన్నారు. అసదుద్దీన్ కు ట్రీట్ మెంట్ ఇప్పించాలని సీఎం రేవంత్ కు విజ‍్క్షప్తి చేస్తున్నానని చమత్కరించారు రాజాసింగ్. హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని అసదుద్దీన్ ఒవైసీ కుట్ర చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేశారు. ‘అసదుద్దీన్ ఒవైసీ మెంటల్ అయిపోయిండు..సీఎం రేవంత్ రెడ్డి మీ కొత్త దోస్తులకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపియండి’ అని రాజాసింగ్ సెటైర్లు గుప్పించారు.