డిప్యూటీ సీఎం పేరు కొట్టేయడానికే వివరణ ఇచ్చారా?
గవర్నర్ ప్రసంగంపై చర్చకు సీఎం సమాధానం ఇస్తారు. డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించారో తెలియదన్న ప్రశాంత్ రెడ్డి;
అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రుణమాఫీ, హామీలపై, గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించడంపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంపై సభలో భట్టి విక్రమార్క కావాలనే తప్పు ప్రచారం చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చకు సీఎం సమాధానం ఇస్తారు. డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించారో తెలియదు? డిప్యూటీ సీఎం పేరు కొట్టేయడానికే వివరణ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎంతమందికి రుణమాఫీ చేశారో తెలిపారు. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఇంకా మా పై ఏడుపు ఎందుకు అని నిలదీశారు. ఎంతమందికి సన్నబియ్యానికి బోనస్ ఇచ్చారో చెప్పాలని, రూ. 4 వేల పింఛన్ ఇచ్చారా? అని నిలదీశారు.