పేర్లు మార్చడం కాదు.. ప్రజల జీవితాలు మార్చాలి

గవర్నర్‌ ప్రసంగానికి దశ, దిశ లేదని పల్లా ఎద్దేవా;

Advertisement
Update:2025-03-15 11:33 IST

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు మూడో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు కూడా చర్చ కొనసాగుతున్నది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్‌ ప్రసంగానికి దశ, దిశ లేదని ఎద్దేవా చేశారు. ట్రాన్స్‌ఫార్మింగ్‌ నెగిటివ్‌ డైరెక్షన్‌లో నడుస్తున్నాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు.కేవలం 10 శాతం హామీలు మాత్రమే అమలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై కూడా కేసులు పెట్టారు. సాగునీటి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితందగా వ్యవహరిస్తున్నది. వ్యవసాయానికి పెట్టుబడి ఇవ్వాలనే ఆలోచన ప్రపంచంలో ఒక్క కేసీఆర్‌కే వచ్చిందన్నారు. రైతులు పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. గత రెండు సీజన్లు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు. 15 నెలల నుంచి పంటలకు బీమా లేదు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదన్నారు.స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ లోగో మారిన విషయాన్ని అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ప్రస్తావించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక కావాలనే చేశారా అని దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. గతంలోనూ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేసిందని... ప్రజలు, ప్రతిపక్షాలు, మేధావుల నుంచి నిరనస రావడంతో వెనక్కి తగ్గిందన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే పని చేయడంపై మండిపడ్డారు. ఒకవేళ ప్రభుత్వ విధానం అదే అయితే అందేశ్రీ రాసిన రాష్ట్ర గీతంలోనూ చాలా మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. పేర్లు మార్చడం కాదు.. ప్రజల జీవితాలు మార్చాలి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేర్లు మార్చితే.. మేము వచ్చాక మళ్లీ మారుస్తామన్నారు. తెలంగాణ తల్లిని సామాన్యంగా చూపించామన్నారు. తెలంగాణ తల్లిని సామాన్యంగా పెట్టినవారు ఆభరణాలు వేసుకుని తిరుగుతున్నారు. సామాన్యులు ఆభరణాలు వేసుకోకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మ తీసేశారు. వరి ఉత్పత్తిలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలిపింది మా ప్రభుత్వమే అన్నారు.2014-23 వరకు 30 మందికి పైగా వీసీలను నియమించింది కేసీఆర్‌ ప్రభుత్వమే అన్నారు. 1053 పాఠశాలలు ఎందుకు బంద్‌ అయ్యాయి ? 2 లక్షల మంది విద్యార్థులు ఎందు డ్రాప్‌ అవుట్‌ అయ్యారు?అని ప్రశ్నించారు. చిన్న చిన్న పనులు చేసి పెద్దగా చెప్పుకోవడం మానుకోవాలన్నారు.కేఆర్‌ఎంబీ.. చంద్రబాబు చెప్పినట్లే నడుస్తున్నదది. మన హక్కుగా రావాల్సిన వాటాపై సీఎం రేవంత్‌ రెడ్డి పోరాడాలి. హైదరాబాద్‌లో వాటర్‌ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయో చెప్పాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News