సోదరి దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్
చీటి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి
Advertisement
తన సోదరి చీటి సకలమ్మ దశ దినకర్మ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కొంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్ వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఉన్నారు.
Advertisement