ప్రశ్నించే గొంతు నొక్కేందుకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి.. ఇక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.;
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి.. ఇక్కడ మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అనని మాటలు అన్నట్లుగా చూపి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు.. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే మాజీ మంత్రిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభలో తాము తప్పు మాట్లాడి ఉంటే.. ఆ వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తప్పు అని తేలితే తప్పకుండా విచారం వ్యక్తం చేస్తామని అన్నారు. ఏకపక్షంగా సభ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన అనని మాటను.. అన్నట్లుగా చిత్రీకరించారని అన్నారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. నేను మాట్లాడితే మా బట్టలిప్పి నిలబెడతాడు అని భయంతోనే నన్ను అక్రమంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రజల తిట్లు వింటే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఆ పదవిలో ఒక్కనిమిషం కూడా ఉండరని.. అయినా సిగ్గులేకుండా ఉంటున్నారని ఆయన అన్నారు. ఇవాళ నా సస్పెన్షన్ వల్ల నేను భయపడను.. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి నియంతృత్వాలను ఎదురుకొని వచ్చాము ఇవి ఏవి మమ్మల్ని ఆపలేవు, ప్రజాక్షేత్రంలో మా గొంతు నొక్కలేవు జగదీష్ రెడ్డి పేర్కొన్నారు