ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.;
Advertisement
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్లు సరిగా దాఖలు చేయని కారణంగా అవి తిరస్కరించబడ్డాయి. దీంతో ఈ ఐదుగురు ఏకగ్రీవం అయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు రాగా.. వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది. బీఆర్ఎస్ కు ఒక స్థానం రాగా.. ఆ పార్టీ నుంచి దాసోజు శ్రావణ నామినేషన్ దాఖలు చేశారు. కాగా వీరంతా ఏకగ్రీవం అయినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Advertisement